- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలస కూలీలకు ఆరెంజ్ ట్రావెల్ ఉచిత సేవలు
<p>దిశ, నిజామాబాద్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఆరేంజ్ ట్రావెల్ ముందుకొచ్చింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి లేకపోయినా కనీసం రాష్ట్ర సరిహద్దుల వరకు కూలీలను ఉచితంగా చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆరేంజ్ ట్రావెల్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ నుంచి నిత్యం చాలా మంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆరెంజ్ సంస్థకు చెందిన బస్సులతో వారి స్వస్థలాలకు చేర్చే […]</p>

X
దిశ, నిజామాబాద్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఆరేంజ్ ట్రావెల్ ముందుకొచ్చింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి లేకపోయినా కనీసం రాష్ట్ర సరిహద్దుల వరకు కూలీలను ఉచితంగా చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆరేంజ్ ట్రావెల్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ నుంచి నిత్యం చాలా మంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆరెంజ్ సంస్థకు చెందిన బస్సులతో వారి స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. గురువారం నుంచి వీలైనంత మందిని రాష్ట్ర సరిహద్దుల వరకు చేర్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
Tags: Nizamabad,Orange travels,Migrant workers
Next Story






