అదిరిపోయే ఫీచర్స్‌తో రెండు మొబైల్స్ విడుదల చేస్తున్న ఒప్పొ

by  |
latest mobiles
X

దిశ, వెబ్‌డెస్క్: రోజు రోజుకు మార్కెట్‌లోకి కొత్త కొత్త ఫీచర్స్‌తో ప్రముఖ కంపెనీలు మొబైల్ మోడల్‌లను విడుదల చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒప్పొ (OPPO) నుండి కూడా అదిరిపోయే ఫీచర్స్‌తో 2 మొబైల్ వేరియంట్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అవేటంటే.. ఒప్పొ 6 సిరీస్ నుండి ఒప్పొ రెనో 6 5G, రెనో 6 ప్రో 5G ఫోన్‌లను లాంచ్ చేస్తుంది.

8GB ర్యామ్‌తో,128GB స్టోరేజ్ సామర్థ్యం గల ఒప్పొ రెనో 6 5G రూ.29,990 లకు జులై 29న అందుబాటులోకి రానుంది. 12GB ర్యామ్‌తో, 256GB స్టోరేజ్ సామర్థ్యం గల ఒప్పొ రెనో 6 ప్రో రూ.39,990 లకు జులై 20 నుండి సేల్స్ ప్రారంభం కానున్నాయి. వీటిని ఫ్లిఫ్ కార్ట్, ఒప్పొ ఆన్‌లైన్, రిలయన్స్ డిజిటల్ లతో పాట రిటైలర్ల నుండి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనున్నాయి.


Next Story

Most Viewed