యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఎన్ఐఏ ప్రశ్నల వర్షం

by Ajay Maddhiboyina |

పాకిస్థాన్‌కు గూడచర్యం చేస్తుందనే ఆరోపణలతో హర్యాణా యూట్యూబర్ జ్యోతి మల్హాత్రాను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో సంబంధాలు పెట్టుకుని మల్హోత్రా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కీలక విషయాలను

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఎన్ఐఏ ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌కు గూడచర్యం చేస్తుందనే ఆరోపణలతో హర్యాణా యూట్యూబర్ జ్యోతి మల్హాత్రాను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో సంబంధాలు పెట్టుకుని మల్హోత్రా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కీలక విషయాలను ఆ దేశానికి లీక్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా రిమాండ్‌లో ఉండగా ఎన్ఐఏ మరియు ఇంటిలిజెన్స్ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. పాకిస్థాన్‌తో చైనా, బంగ్లాదేశ్, నేపాల్, బూటాన్, దుబాయ్ లాంటి దేశాల్లో జ్యోతి ఎక్కువగా పర్యటించడంతో ఆ కోణంలో అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటి వరకు జరిపిన విచారణలో 2010లో జ్యోతికి పాస్ పోర్ట్ రాగా దాని గడువు 2028 వరకు ఉంది. పాస్ పోర్ట్ వచ్చినప్పటి నుండే జ్యోతి పలు దేశాల్లో పర్యంటించింది. పాకిస్థాన్ మరియు ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల వరకు జ్యోతికి సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. ఈ సరిహద్దు ప్రాంతాలు ఉగ్రకార్యకలాపాలకు అడ్డాగా ఉంటాయి. అంతే కాకుండా ఈ ప్రాంతాల్లో మనుషుల సంచారంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. మరోవైపు పాకిస్థాన్‌కు గూడచర్యం చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ల కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి అప్పగించే అంశాన్ని హోంశాఖ పరిగణలోి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story