America-Pakistan: అమెరికా, పాకిస్థాన్ మధ్య అవినాభావ మైత్రి ఎందుకు.. పాక్‌కు అప్పులు ఎందుకు ఇస్తుంది..? కారణం ఇదేనా..?

by Vennela |   (  Updated:2025-05-11 06:44:24  IST  )

America-Pakistan: భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తానని పలుమార్లు ఆఫర్ ఇచ్చింది.

America-Pakistan: అమెరికా, పాకిస్థాన్ మధ్య అవినాభావ మైత్రి ఎందుకు.. పాక్‌కు అప్పులు ఎందుకు ఇస్తుంది..? కారణం ఇదేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: America-Pakistan: భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తానని పలుమార్లు ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ కార్యదర్శి సైతం ఇరుదేశాలతో సంధి కుదుర్చేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో ఒక విషయం గమనించవచ్చు.

ఓవైపు భారత్ కు రష్యా దేశాలతో మద్దతు ప్రకటిస్తే, అమెరికా ఇప్పటివరకు భారత్ వైపు తమ మద్దతు తెలుపుతున్నట్లు ఒక ప్రకటన కూడా చేయలేదు. మొదటినుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిస్తానని చర్చలు జరిపే వాతావరణం తెస్తామని మొదటి నుంచి అమెరికా చెబుతోంది. కానీ ఆపరేషన్ సింధూర్ ఎందుకోసం జరిగింది.

పాకిస్తాన్ ఉగ్రవాదానికి అడ్డా అని అక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని భారత్ అనేక సార్లు అంతర్జాతీయ వేదికలపై సాక్షాలతో సహా బయటపెట్టినప్పటికీ, ఇప్పటికీ పాకిస్తాన్ కు అమెరికా దాని అనుబంధ ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ రుణాలు తీసుకొని ఆ డబ్బులను సైనిక అవసరాలకు వాడుకుంటూ భారత్ పైన దాడులకు దిగుతోంది.

ఇంత సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారత్ వద్దు అని వారిస్తున్నప్పటికీ కూడా అమెరికా మద్దతుగా నడిచే ఐఎంఎఫ్ రెండు కీలక రుణాలను మంజూరు చేసింది. 2025 మే 9న, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పాకిస్తాన్‌కు రెండు ప్రధాన రుణాలను మంజూరు చేసింది. ఇందులో 1 బిలియన్ డాలర్లు (రూ. 8,300 కోట్లు) IMF యొక్క Extended Fund Facility (EFF) కింద మంజూరైనట్లు తెలిపింది. అలాగే 1.4 బిలియన్ డాలర్ల (రూ. 11,620 కోట్లు) రుణం Resilience and Sustainability Facility (RSF) కింద వాతావరణ మార్పులకు సంబంధించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం మంజూరు చేసినట్లు తెలిపింది.

మొత్తంగా ఈ రెండు కలిసి 2.4 బిలియన్ డాలర్లు అంటే రూ. 19,920 కోట్లకు పైగా IMF నుంచి పాకిస్థాన్ కు రుణం లభించింది. నిజానికి ఈ డబ్బును పాకిస్తాన్ ఎక్కువగా ఉగ్రవాద శిబిరాలు తయారు రూపొందించడానికి, సైన్యాన్ని సిద్ధం చేయడానికి ఉపయోగిస్తుందని భారత్ ఆరోపించింది. కానీ వీటన్నింటినీ బేఖాతరు చేస్తూ ఐఎంఎఫ్ రుణం మంజూరు చేసింది. నిజానికి పాకిస్తాన్ - అమెరికా మధ్య సత్సంబంధాలకు ప్రధాన కారణం.

1980వ దశకంలో రష్యా మద్దతుతో ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని పడగొట్టడానికి అమెరికా ప్రయత్నాలకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ రష్యాను దెబ్బ తీసేందుకు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు ఆయుధ శిక్షణ ఇవ్వడంతో పాటు, ముజాహిదీన్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి అమెరికా పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ గూడచారి సంస్థను తెగ వాడుకుంది. అప్పటినుంచి అమెరికా పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధంలో రష్యా పైన పై చేయి సాధించడానికి పాకిస్తాన్ అమెరికాకు సహకరించింది.

అలాగే అమెరికాపై జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా ఆఫ్గనిస్తాన్ పై జరిపిన దాడులకు కూడా అమెరికాకు పాకిస్తాన్ సహకరించింది. అందుకే అమెరికా, పాకిస్తాన్ మధ్య అవినాభావ సంబంధం ఉంది. పాకిస్తాన్ ఎంత సంక్షోభంలో ఉన్న అమెరికా నుంచి ఆర్థిక సహాయం అందుతూ ఉంటుంది. అనేందుకు తాజాగా మంజూరైన ఐఎంఎఫ్ రుణం ఒక సాక్ష్యంగా చెప్పవచ్చు.

యుద్ధం చేస్తూ తెలియకుండానే లాహోర్ వరకూ దూసుకెళ్లిన భారత సైన్యం...చేతులెత్తేసిన పాకిస్థాన్ ఎప్పుడంటే..?

Next Story