Operation Sindoor:‘ఆపరేషన్ సిందూర్’ పై సైకత శిల్పం.. ఈ అద్భుతమైన దృశ్యం ఎక్కడుందంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-08 14:19:25  IST  )

జమ్మూకాశ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Operation Sindoor:‘ఆపరేషన్ సిందూర్’ పై సైకత శిల్పం.. ఈ అద్భుతమైన దృశ్యం ఎక్కడుందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌కి వెళ్లిన టూరిస్టుల పై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ విషాద ఘటనలో కళ్ల ముందే కట్టుకున్న వారిని కడతేర్చి తీరని శోకాన్ని మిగిల్చారు. ఆడబిడ్డల నుదుట బొట్టును తుడిచేసిన ఉగ్రమూకలపై భారత్(India) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో రంగంలోకి దిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రముఖ సైకత శిల్పి, ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాయక్(Sudarshan Patnaik) మరో ఆసక్తికర సైకత శిల్పంతో ముందుకు వచ్చాడు. ‘ఆపరేషన్ సిందూర్’ పై సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఫైటర్ జెట్ పాకిస్థాన్‌లో విధ్వంసం సృష్టిస్తుంటే.. దానిలో నుంచి సింధూరం వచ్చి భారతీయ స్త్రీ నుదిటిపై పడినట్లు రూపొందించారు. ఈ సైకత శిల్పాన్ని పూరీ తీరంలో ఎంతో అద్భుతంగా మలిచారు. అంతేకాదు ఈ సైకత శిల్పంలో ‘భారత్ మాతాకీ జై.. న్యాయం లభించింది’ అని క్యాప్షన్ కూడా జోడించారు. ఈ వీడియోను సుదర్శన్ ఎక్స్(X) ఖాతాలో పోస్ట్ చేశారు.

https://x.com/sudarsansand/status/1920324497582010723

Next Story