యుద్ధం ఆపేయడానికి రెండు దేశాలు సిద్ధం.. US ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-11 12:09:31  IST  )

భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న వేళ అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రంగంలోకి దిగారు.

యుద్ధం ఆపేయడానికి రెండు దేశాలు సిద్ధం.. US ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న వేళ అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రంగంలోకి దిగారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని తెలిపారు. స్వయంగా తామే రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించామని.. తమ ప్రతిపాదనను రెండు దేశాలు గౌరవించాయని పేర్కొన్నారు. తక్షణ సీజ్‌ఫైర్‌కు ఇరు దేశాలు అంగీకరించాయని పేర్కొన్నారు. దీంతో రెండు దేశాలకు ట్రంప్ అభినందనలు తెలిపారు.

ఇదిలా ఉండగా.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా సర్వం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్ట్‌లను మూసివేయడంతో పాటు మొత్తం 24 ఎయిర్‌పోర్టుల్లో పౌర విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఐపీఎల్‌ 2025 టోర్నమెంట్‌ కూడా అర్ధాంతరంగా వాయిదా పడింది. ట్రంప్ ప్రకటనతో సాధారణ పరిస్థితులు వస్తే వారం రోజుల్లో ఐపీఎల్ సీజన్‌తో పాటు విమానాల రాకపోకలపై ఆంక్షలను కూడా ఎత్తివేయనున్నారు.

Next Story