ICUలో ఫిరోజ్ పూర్ బాధితులు..వీడియో వైరల్

by velandi.Saikiran |

పాకిస్తాన్ డ్రోన్స్ తో (Pakistan Drones) మరోసారి రెచ్చిపోయింది. నిన్న జమ్మూ కాశ్మీర్ పై (Jammu kashmir) కన్నేసిన పాకిస్త

ICUలో ఫిరోజ్ పూర్ బాధితులు..వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ డ్రోన్స్ తో (Pakistan Drones) మరోసారి రెచ్చిపోయింది. నిన్న జమ్మూ కాశ్మీర్ పై (Jammu kashmir) కన్నేసిన పాకిస్తాన్.. ఇవాళ ఇండియాలోని ( India) 26 ప్రాంతాల్లో డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ ( Pakisthan). అయితే.. ఆ డ్రోన్లను వెంటనే గుర్తించిన భారత సాయుధ దళాలు... పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి. అయితే దురదృష్టవశాత్తు ఫిరోజ్ పూర్ లో ( Ferozepur) పెను ప్రమాదం జరిగింది.

ఓ సాయుధ డ్రోన్ పడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఓకే ఇంటిపై ఈ డ్రోన్ పడినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ మహిళ అలాగే ఇద్దరు పురుషులు ఉన్నారని సమాచారం అందుతుంది. ఈ ముగ్గురికి... మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇందులో ఓ మహిళ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆసుపత్రికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇద్దరు పురుషులు బెడ్ పైన పడుకున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉందని చెబుతున్నారు వైద్యులు. ఇక అటు పాకిస్తాన్ డ్రోన్లను... గుర్తించి మరీ ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది.




Next Story