- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే?
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరిట మెరుపు దాడులు నిర్వహించింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ క్రమంలో ఆ 9 ఉగ్రస్థావరాలు ఏవి? ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
భారత్ టార్గెట్ చేసి ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలు ఇవే..
* అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం
* మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్
* సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8 కి.మీ దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్. ఇది జేఎంకు ఒక క్యాంప్.
* అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్‌కోట్ సమీపంలో ఉన్న హెచ్‌ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్
* రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్
* సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉ్న గుల్పూర్
* రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్
* పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్
* జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






