ఇళ్లలోనే ప్రజలు.. జైసల్మేర్‌లో హై టెన్షన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-10 08:26:59  IST  )

భారత్, పాకిస్థాన్ సరిహద్దులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది....

ఇళ్లలోనే ప్రజలు.. జైసల్మేర్‌లో హై టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్(Bharat), పాకిస్థాన్(Pakistan) సరిహద్దులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని పౌరులను పాక్ ఆర్మీ టార్గెట్ చేసింది. ఈ మేరకు ఇవాళ తెల్లవారుజామున డ్రోన్స్, మిసైల్స్‌తో పాటు మందు సామాగ్రితో దాడులకు పాల్పడింది. అయితే ఈ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. భారత్ భూభాగంలోకి ప్రవేశించిన ఆయా క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేసింది. దీంతో రాజస్థాన్, జమ్మూకాశ్మీర్‌లో పౌరల ఇళ్లు, పొలాల, సమీప ప్రాంతాల్లో డ్రోన్లు, మిసైల్స్ శిథిలాలు పడ్డాయి. ఈ సమయంలో పలు ఇళ్లు సైతం ధ్వంసం అయింది.

అయితే రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్‌( Rajasthan State Jaisalmer)‌లో మాత్రం భారీ మిసైల్(Huge Missile) కలకలం రేపింది. ఆరు కిలో మీటర్ల దూరంలో గ్రిడ గ్రామంలోకి దూసుకు వస్తున్న మిస్సైల్స్‌ను భారత ఆర్మీ ధ్వంసం చేయకపోతే ప్రాణ నష్టం భారీగా జరిగి ఉండేదని అంచనా వేసింది. దీంతో జైసల్మేర్‌‌లో మరింత హై అలర్ట్ ప్రకటించింది. జైసల్మేర్ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచే ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని ఆదేశించారు. దీంతో జైసల్మేర్‌‌లోని ప్రధాన రహదారులన్నీ ఖాళీ అయ్యాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఒక్కరు కూడా బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆ పరిణామంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Next Story