Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ లోగో రూపకర్తలు వీరే.. ఇంతకీ సైన్యంలో వారి హోదా?

by Ramesh Naini |   (  Updated:2025-05-27 10:10:43  IST  )

పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సంగతి తెలిసిందే.

Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ లోగో రూపకర్తలు వీరే.. ఇంతకీ సైన్యంలో వారి హోదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు ఇండియన్ ఆర్మీ (OPERATION SINDOOR) ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సంగతి తెలిసిందే. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అందుకు ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్' పేరుతో మే 7 అర్ధరాత్రి దాటిన తర్వాత భారత రక్షణ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)‌లోని తొమ్మది ఉగ్రవాద శిబిరాలపై దాడులతో విరుచుకపడ్డాయి. ఈ మేరకు మే 7న అర్థ రాత్రి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్ అంటూ లోగోతో ఉన్న ఫోటోను విడుదల చేసి వివరాలను పంచుకుంది. అందులో భాగంగా ఆపరేషన్ సిందూర్ లోగో చూసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక ఆ పోస్టర్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. నేటికి ఆదే లోగో పోస్టర్‌ను నెట్టింట తరుచుగా కన్పిస్తూనే ఉంటుంది.

లోగోను డిజైన్ చేసింది ఎవరంటే?

'ఆపరేషన్ సిందూర్' లోగో (logo designers) రూపకర్తలను వార్ రూమ్ ఫోటోలు, వివరాలను తాజాగా భారత ఆర్మీ కార్యాలయం విడుదల చేసింది. అందులో లెఫ్టినెంట్ కల్నల్ హర్ష గుప్తా (Lieutenant Colonel Harsha Gupta), హవాల్దార్ సురీందర్ సింగ్ (Havaldar Surinder Singh) ఆపరేషన్ సిందూర్ లోగోను రూపొందించినట్లు ప్రకటించింది. వారి ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తెలివిగా లోగోను రూపొందించారని అధికారులను నెటిజన్లు ప్రశంసించారు. ఈ లోగోలో "OPERATION SINDOOR" అనే పదాలు పెద్ద అక్షరాలతో రాశారు. "SINDOOR" లోని 'O'లో ఒకటి సింధూరంతో ఉన్న గిన్నెను చిత్రీకరించారు. మరో 'O'చుట్టు పక్కల ఎర్రటి పొడిలో కొంత భాగం చిందినట్లు చెల్లా చెదురుగా ఉన్నట్లు, చిందిన రక్తాన్ని పోలి ఉంటుంది.

అందులో సిందూర్ హిందూ మహిళల వైవాహిక స్థితిని సూచిస్తుంది. లోగోలో చిందిన సిందూర్ కోల్పోయిన జీవితాలు, భాగస్వాములను కోల్పోయిన మహిళల దుఃఖాన్ని సూచిస్తోంది. అదే సమయంలో ప్రతీకారం తీర్చుకున్నామనే దృఢ సంకల్పం తెలియజేస్తోంది. ఇక ఈ ఆపరేషన్ సిందూర్ దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించిన విషయం తెలిసిందే. అనంతరం భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. అమెరికా చొరవతో ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరింది. మరోవైపు పాక్ కవ్వింపు చర్యలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది.

Next Story