- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశ సమగ్రతను కేంద్రం కాపాడాలి.. సీపీఐ పొలిట్ బ్యూరో లేఖ విడుదల
పహల్గాం ఉగ్రదాడి (Pahelgam Terror Attack)పై ఎట్టకేలకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం ఉగ్రదాడి (Pahelgam Terror Attack)పై ఎట్టకేలకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులకు దిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్ సమర్ధిస్తూ ప్రముఖ రాజకీయ నాయకులు, అధికార, విపక్ష నేతలు సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (Communist Party of India (Marxist) పార్టీ ఓ లేఖను విడుదల చేసింది.
అందులో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలు, మౌలిక సదుపాయాలను నాశనం చేసే లక్ష్యంతో భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టడం అందరూ హర్షించదగిన విషయమని అన్నారు. ఏక కాలంలో మొత్తం 9 చోట్ల ఉగ్రమూకల స్థావరాలను టార్గెట్ చేసుకుని దాడులు చేశారని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఉగ్రవాదులు, వారికి సహకరించే వారిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతును ఇచ్చాయని పేర్కొన్నారు. ఈ చర్యలతో పాటు పహల్గాంలో అమాయక ప్రజల ఊచకోతకు కారణమైన వారిని వెంటనే పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత భూభాగం వెంట ఎటువంటి ఉగ్రవాద శిబిరాలు లేకుండా చేసేలా పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ప్రజల ఐక్యత, దేశ సమగ్రతను కాపాడేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






