India - Pakistan War: ఆప్ఘనిస్తాన్ పై పాక్ ఆరోపణలు.. ఖండించిన రక్షణశాఖ

by Naga Rani Yarlagadda |

భారత్ - పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం (India Pakistan War) నేపథ్యంలో పాక్ తప్పుడు ప్రచారాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భారత్ తమపై దాడి చేసేందుకు ఆఫ్గాన్ భూభాగాన్ని వాడుకుంటోందని పాకిస్థాన్ ఆరోపణలు చేసింది.

India - Pakistan War: ఆప్ఘనిస్తాన్ పై పాక్ ఆరోపణలు.. ఖండించిన రక్షణశాఖ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం (India Pakistan War) నేపథ్యంలో పాక్ తప్పుడు ప్రచారాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భారత్ తమపై దాడి చేసేందుకు ఆఫ్గాన్ భూభాగాన్ని వాడుకుంటోందని పాకిస్థాన్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను ఆఫ్గాన్ ఖండించింది. భారత్ తమ భూభాగం నుంచి పాక్‌పై దాడి చేయలేదని ఆ దేశ రక్షణశాఖ స్పష్టం చేసింది.

మరోవైపు భారత్ కూడా ఈ ఆరోపణలపై స్పందించింది. భారత్ ఆఫ్గాన్ మీదుగా క్షిపణి దాడి చేసిందన్న ఆరోపణలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (vikram misri) తోసిపుచ్చారు. భారత్ నుంచి ప్రయోగించిన ఏ క్షిపణులు ఆఫ్గాన్ మీదుగా వెళ్లలేదని స్పష్టం చేశారు. తమ దేశ పౌరులను ఏ దేశం టార్గెట్ చేసుకుంటుందో ఆఫ్గాన్ ప్రజలకు తెలుసన్నారాయన. పాకిస్థానే పదే పదే రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోందని, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు పాక్ చర్యలే కారణమన్నారు. జమ్మూకశ్మీర్, పంజాబ్ లోని పౌరులు, పౌర మౌలిక సదుపాయాల్ని పాక్ లక్ష్యంగా చేసుకుంటూనే ఉందన్నారు. పాక్ సైన్యం తన దళాలను మరింత ముందుకు తరలిస్తున్నట్లు గుర్తించామని, ఇది దాడిని మరింత తీవ్రం చేసే చర్యగానే పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.

Next Story