మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. లాంచ్ ప్యాడ్ దాడిని తిప్పికొట్టిన బీఎస్ఎఫ్ (Videos Viral)

by Vemula.Srinu Prasad |

భారత సరిహద్దులో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు..

మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. లాంచ్ ప్యాడ్ దాడిని తిప్పికొట్టిన బీఎస్ఎఫ్ (Videos Viral)
X

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాదులు(Terrorists) మళ్లీ రెచ్చిపోయారు. పహల్గాం దాడి(Pahalgham Attack)తో భారత్(Bharat), పాకిస్థాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీసుకురావడమే కాకుండా మరోసారి కూడా దుశ్చర్యకు పాల్పడుతోంది. భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు ఉధృతంగా జరుగుతున్న వేళ జమ్మూ కాశ్మీర్‌(Jammu Kashmir)పై విరుచుకుపడేందుకు యత్నించారు. ఈ ఉదయం 9 గంటలకు లాండ్ ప్యాడ్ దాడులకు ఉగ్రమూకలు ప్రయత్నం చేశారు.

భారత సరిహద్దు ప్రాంతానికి ఎదురుగా ఉన్న పాకిస్థాన్‌లోని సియాల్ కోట్ జిల్లా లూని నుంచి ల్యాంచ్ ప్యాడ్ దాడికి రాత్రి సమయంలో యత్నించారు. అయితే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే భారత భూభాగమైన జమ్మూసెక్టార్‌లోని అఖ్నూర్ ప్రాంతం నుంచి దాడి చేసి ధ్వంసం చేశారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story