ఉగ్రవాదం అంతం కావాల్సిందే.. ఆపరేషన్ సిందూర్‌పై కేసీఆర్ రియాక్షన్ ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-07 07:19:26  IST  )

పహల్గాం టెర్రర్ అటాక్‌ (Pahelgam Terror Attack)కు ప్రతీకారంగా పీవోకే (POK), పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాదుల శిబిరాలపై భారత సైన్యం (Indian Army) చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)పై దేశ వ్యాప్తంగా ప్రజలకు సంబురాలు చేసుకుంటున్నారు.

ఉగ్రవాదం అంతం కావాల్సిందే.. ఆపరేషన్ సిందూర్‌పై కేసీఆర్ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్‌ (Pahelgam Terror Attack)కు ప్రతీకారంగా పీవోకే (POK), పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాదుల శిబిరాలపై భారత సైన్యం (Indian Army) చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)పై దేశ వ్యాప్తంగా ప్రజలకు సంబురాలు చేసుకుంటున్నారు. అమాయక టూరిస్టులపై కాల్పులకు తెగబడినందుకు ఉగ్రమూకలకు తగిన శాస్తి జరిగిందని కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌పై దేశ వ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఈ పరిణామంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) స్పందించారు.

ఉగ్రవాదం ఎప్పటికైనా అంతం కావాల్సిందేనని అన్నారు. భారత సైన్యం ప్రదర్శించిన సైనిక ప్రతిభా పాఠవాల పట్ల తాను ఒక భారతీయుడిగా ఎంతో గర్వపడుతున్నానని తెలిపారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా.. ప్రపంచ మానవాళికి నష్టం కలించేదే తప్ప లాభం చేకూర్చేది కాదన్నారు. ఈ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే దేశంలో శాంతి సామరస్యాలు నెలకొంటాయని ఆకాంక్షించారు. భారత సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో.. అంతే అప్రమత్తంగా ఉండి దేశ రక్షణలో తాము ఎవరికీ తీసిపోమని అన్నట్లుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కేసీఆర్ అన్నారు.

Next Story