- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు.. సీఎం నివాసంలో కీలక సమావేశం
by Kema Shiva Kumar |
భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సరిహద్దులో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కాసేపటి క్రితం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తన నివాసంలో మరోసారి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, డీజీ ఇంటెలిజెన్స్, ఏడీజీ శాంతిభద్రతలు, తదితరులు పాల్గొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. కాగా, గురువారం రాత్రి దాయాది పాక్ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ను టార్గెట్ చేస్తూ డ్రోన్ బాంబులను ప్రయోగించింది. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు వాటిని గాల్లోనే బ్లాస్ట్ చేశారు. ఆకాశంలో ఉన్నట్టుండి పెద్ద పేలుళ్ల శబ్దాలు విన్న జనం తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.
Next Story






