- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్‌పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక
ఆపరేషన్ సిందూర్‌పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Telangana Cyber Security Bureau) హెచ్చరించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'ఎక్స్' ఖాతాలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోస్ట్ చేసింది. ఆపరేషన్ సిందూర్‌పై దుష్ప్రచారం చేసేనట్లుగా మీ దృష్టికి ఏదైనా వస్తే.. 8712672222కు వాట్సాప్ చేయాలని సూచించింది.
కాగా, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు హై అలర్ట్ కొనసాగుతోంది. ఓవైపు మిస్‌వరల్డ్ (Miss World 2025) పోటీలు మరోవైపు ఐపీఎల్ (IPL) మ్యాచ్‌తో మరింత అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు అణువణువు గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలోని మూడు కమిషనరేట్ల సీపీలు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.






