ఆపరేషన్ సిందూర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ టార్గెట్.. పహెల్గాం దాడి జరిగాక మారిన పరిస్థితి.. వైరల్ అవుతున్న పోస్టులు

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-09 10:20:48  IST  )

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. భారత్ పాక్‌కు చుక్కలు చూపిస్తోంది. ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటిస్తున్నాయి. దేశమంతా యుద్ధ పరిణామాలపై ఉత్కంఠతో ఉంది. ప్రజలు, వ్యాపారవేత్తలు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఓ వైపు యుద్ధం జరుగుతుంటే.. టాలీవుడ్‌లో మాత్రం ఫ్యాన్స్

ఆపరేషన్ సిందూర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ టార్గెట్.. పహెల్గాం దాడి జరిగాక మారిన పరిస్థితి.. వైరల్ అవుతున్న పోస్టులు
X

దిశ, ఫీచర్స్ : ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. భారత్ పాక్‌కు చుక్కలు చూపిస్తోంది. ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటిస్తున్నాయి. దేశమంతా యుద్ధ పరిణామాలపై ఉత్కంఠతో ఉంది. ప్రజలు, వ్యాపారవేత్తలు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఓ వైపు యుద్ధం జరుగుతుంటే.. టాలీవుడ్‌లో మాత్రం ఫ్యాన్స్ యుద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ నంబర్ ఆఫ్ పోస్టులు అప్‌లోడ్ అవుతున్నాయి. ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా కామెంట్స్ పెడుతున్నారు.

విషయం ఏంటంటే.. పహెల్గాం దాడిలో ఉగ్రవాదులు హిందువులా, ముస్లింలా అని అడిగి మరీ హిందువులపై దాడి చేశారు. దీని ఎఫెక్టే ఆపరేషన్ సిందూర్ కాగా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్ వార్ దీన్ని బేస్ చేసుకునే జరుగుతోంది. ఎన్టీఆర్ ముస్లిం వ్యక్తి అని.. ఆయన పేరు మార్చుకుని జూనియర్ తారక రామా రావుగా పేరు సంపాదించుకున్నాడని ఘోరమైన ట్రోల్స్ చేస్తున్నారు. షాప్ నేమ్ ఒకటి.. యూపీఐ ఐడీ మరొకటి అంటూ క్రిటిసైజ్ చేస్తున్నారు.

కాగా, అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అని స్పష్టంగా తెలుస్తోంది. జూనియర్‌పై కావాలనే కొంతమంది ఫేక్ పబ్లిసిటీకి దిగినట్టు ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక లెజండ్ హీరో ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నందమూరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ ఫేక్ పోస్టులను ఎవరూ నమ్మవద్దని కోరుతున్నారు.

Click For Tweet..

Next Story