Operation Sindoor: జలంధర్‌లో డ్రోన్లు కలకలం.. రాత్రి నుంచి టెన్షన్.. టెన్షన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-09 02:30:51  IST  )

పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లో రాత్రి డ్రోన్లు కలకలం సృష్టించాయి...

Operation Sindoor: జలంధర్‌లో డ్రోన్లు కలకలం.. రాత్రి నుంచి టెన్షన్..  టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: భారత సరిహద్దు(Indian Boarder)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పంజాబ్(Panjab), గుజరాత్‌(Gujarat)తో పాటు యూపీ లాంటి ప్రాంతాల్లో పాకిస్థాన్(Pakistan) సైన్యం, ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలున్న నేపథ్యంలో భారత సైన్యం అలర్ట్ అయింది. పాక్ సైన్యం చేపడుతున్న చర్యలను దీటుగా ఎదుర్కొంటోంది. అయితే పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లో రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అకస్మాత్తుగా వచ్చిన డ్రోన్లు కలకలం సృష్టించాయి. దీంతో భారత సైన్యం నిర్వీర్యం చేశారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

మరోవైపు వైమానిక దాడులు జరుగుతాయనే ముందు జాగ్రత్తగా రాత్రి పఠాన్‌కోట్, అమృత్‌సర్, జలంధర్, రూప్‌నగర్, ఫాజిల్కా, లూథియానా, హోషియార్‌పూర్ మరియు సాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌తో సహా చాలా జిల్లాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. అయితే పఠాన్ కోట్ జిల్లాలో రాత్రి భారీ పేలుడు శబ్దాలు విన్నట్లు స్థానికులు తెలిపారు. కానీ ఈ ఘటనను అధికారులు ధృవీకరించలేదు.

Next Story