- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India-Pakistan war: జైశంకర్‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. ఏం మాట్లాడరంటే?
భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య యుద్ధం నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య యుద్ధం నడుస్తోంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు (Operation sindoor) ప్రతీకార చర్యగా పాక్ గురువారం రాత్రి నుంచి డ్రోన్లు, మిస్సైల్స్, యుద్ధ విమానాలతో దాడులకు పాల్పడుతుంది. పాక్ దాడులను భారత్ దీటుగా అడ్డుకుని.. ఎదురుదాడి చేసి పాక్‌ను మట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు తారాస్థాయికి చేరాయి. అంతేకాదు, ఆపరేషన్ సిందూర్‌కు పోటీగా పాక్ ఆర్మీ ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు (Jai Shankar) అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) శనివారం ఫోన్ చేసి మాట్లాడారు. ఇరు దేశాల మధ్య పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వివాదాలు తలెత్తకుండా రెండు దేశాలకు మద్ధతిస్తామని అన్నారు. పెరుగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణిగేలా చూడాలని, అవసరమైతే ఇరు దేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామన్నారు.
కాగా, అంతకుముందే మార్కో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, ఇరు దేశాల మధ్య చర్చల అవసరం ఉందని తెలిపారు.






