- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: వీరజవాన్ మురళి కుటుంబానికి రూ.25 లక్షలు.. ప్రకటించిన పవన్‌కల్యాణ్
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో జవాన్మురళినాయక్భౌ తిక కాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో జవాన్మురళినాయక్(Murali Naik) భౌతిక కాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు. శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో ఎవరూ యుద్ధం కోరుకోలేదన్నారు. మన దేశాన్ని రక్షించుకునే క్రమంలో మురళినాయక్మరణించాడని అన్నారు. యుద్ధం రావడానికి పాకిస్తానే కారణం అన్నారు. వారం కిందట పాకిస్తాన్ఆర్మీ జనరల్ఉగ్రవాదులను ప్రేరేపించే విధంగా మాట్టాడారని గుర్తు చేశారు. నాలుగు యుద్ధాలు చేసినా వారికి దాహం తీరలేదన్నారు. నిన్న సీజ్ఫైర్అన్న తర్వాత కూడా మళ్లీ బాంబుల దాడి చేశారని అన్నారు.
పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందన్నారు. తర్వాత మూడు గంటల్లోనే సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించారని అన్నారు. టెర్రరిస్టులకు బలమైన గుణపాఠం చెప్పాలని ప్రజలంతా కోరుకున్నారని తెలిపారు. తన సొంతగా రూ.25 లక్షలు మురళీ నాయక్కుటుంబానికి ఇస్తానని ప్రకటించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీకి, రక్షణ రంగానికి అండగా ప్రజలు నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి సత్యకుమార్మాట్లాడుతూ మురళి నాయక్పవన్కల్యాణ్వీరాభిమాని అని వెల్లడించారు. జోహార్మురళి నాయక్అంటూ నినాదాలు చేశారు.






