Indus Water: సింధూ నదీ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష తప్పనిసరి: కేంద్రం

by Prasad Jukanti |   (  Updated:2025-05-24 11:44:39  IST  )

భారత్-పాక్ మధ్య ఘర్షణ వాతావరణం వేళ కేంద్రం కీలక నిర్ణయం వెల్లడించిది.

Indus Water: సింధూ నదీ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష తప్పనిసరి: కేంద్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సింధూ నదీ జలాల (Indus Water) ఒప్పందంపై పునఃసమీక్ష తప్పనిసరి అని భారత విదేశాంగ శాఖ (Department of Foreign Affairs)పేర్కొంది. సింధూ జలాల ఒప్పందానికి మూలం స్నేహం, సద్భావన అని వీటిని పాకిస్తాన్ (Pakistan) పక్కన పెట్టడం వల్లే ఒప్పందం నిలిపివేసినట్లు తెలిపింది. సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేతపై పార్లమెంటరీ స్థాయి సంఘానికి విదేశాంగ శాఖ నివేదిక ఇచ్చింది. పహెల్గాం ఉగ్రదాడి (Pahelgam Attack) తర్వాత సింధూ నది జలాలపై నిర్ణయం తీసుకున్నాంమని వెల్లడించింది. ఇంజినీరింగ్ పద్ధతులు, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని గ్లేసియర్స్ మెల్టింగ్ సహా భౌగోళిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని నివేదికలో పేర్కొంది. భారత్ నిర్ణయాన్ని సమర్థించేందుకు విదేశాలకు ప్రతినిధులను పంపినట్లు పేర్కొంది.

పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 1960 సెప్టెంబర్ 19న ఇరు దేశాల మధ్య జరిగిన సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా సింధూ ఉపనదుల్లో తూర్పువైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లైట్ నదులపై భారత్ కు, పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, జినాబ్ లపై పాకిస్తాన్ కు హక్కులు లభించాయి.

Next Story