‘15 నిమిషాల్లోనే శత్రువులను చావు దెబ్బ కొట్టాం’.. మరోసారి సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోడీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-13 10:44:43  IST  )

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు.

‘15 నిమిషాల్లోనే శత్రువులను చావు దెబ్బ కొట్టాం’.. మరోసారి సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భారత సైనికులతో(Indian Amry) ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘భారత్ మాతాకీ జై’ అంటూ ప్రసంగం ప్రారంభించారు. యుద్ధ క్షేత్రంలోనూ భారత్ మాతాకీ జై అనే నినాదాలు చేసినట్లు గుర్తుచేశారు. ఉగ్రవాదం అంతం చేయాలని మన సైన్యం శపథం చేసింది. అందులో భాగంగానే ఉగ్రవాద స్థావరాలను మట్టిలో కలిపింది. మన సైన్యం దాడిలో దాదాపు తొమ్మిది ఉగ్ర స్థావరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వందమందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మరోసారి భారత్ వైపు చూస్తే జరిగేది వినాశనమే అనేలా బుద్ధి చెప్పామని అన్నారు.

వాళ్లు పిరికిపందల్లా దాక్కొని మనపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. మన సైన్యం వారి దాడిని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు.. నేరుగా పాకిస్తాన్ గుండెలపై దాడి చేసింది. ఇది భారత దేశం, భారత సైన్యం సత్తా అని మోడీ కొనియాడారు. మన ధైర్య సాహసాలు చూసి పాక్‌కు గుండెలు అదిరాయి. కొన్ని రోజులు పాక్ కనీసం నిద్ర కూడా పోలేదు. మన సైన్యం చూపిన శక్తి సామర్థ్యాలు భావితరాలకు గొప్ప ప్రేరణ అని అన్నారు. కేవలం 15 నిమిషాల్లోనే శత్రువులను చావు దెబ్బ కొట్టాం. ఇదంతా ప్రొఫెషనల్ సామర్థ్యంతోనే సాధ్యమైంది. మన సైన్యం చూపిన తెగువకు శత్రువు డీలా పడిపోయాడు. ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) అనే నిదానం ప్రపంచం మొత్తం మారుమోగుతోంది. క్లిష్ట సమయంలో సైన్యానికి అండగా నిలిచిన ప్రతీ భారతీయుడికి, అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు చెప్పారు.

Read More..

ఇళ్లలోకి దూరి మరీ చంపేస్తాం.. మరోసారి హెచ్చరించిన ప్రధాని మోడీ

Next Story