Operation Sindoor: రా.8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

by Prasad Jukanti |

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని మీడియా ముందుకు రాబోతున్నారు.

Operation Sindoor: రా.8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఇవాళ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను (Operation Sindoor) చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో భారత సైన్యం విజయం సాధించినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తీవ్ర సస్పెన్స్ క్రియేట్ చేసిన ఈ ఆపరేషన్ తర్వాత ప్రధాని తొలిసారి మీడియా ముందుకు రాబోతున్నారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుంచి త్రివిధ దళాధిపతులు, ఎన్ఎస్ఏ, సీడీఎస్ తో మోడీ వరుసగా సమీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎప్పటికప్పడు ఆపరేషన్ సిందూర్ వివరాలు తెలుసుకుంటూ అనుసరించాల్సిన వ్యూహాలను భద్రతా దళాలకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ పై పబ్లిక్ గా మాట్లాడని మోడీ ఇవాళ మీడియా ముందుకు రాబోతున్నారు. దీంతో ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ వెనక్కి తగ్గడం, కాల్పుల విరమణలో అమెరికా జోక్యం వంటి విషయాల్లో మోడీ ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

Next Story