Breaking: ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక భేటీ

by Vemula.Srinu Prasad |

Breaking: ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi) అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్(Ajit Doval) పాటు, సీడీఎస్, సాయుధ దళాల చీఫ్‌లు సైతం హాజరయ్యారు. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన దాడుల నేపథ్యంలో శనివారం ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత చోటు చేసుకుంది. పాకిస్థాన్, భారత్ మధ్య నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన భీకరమైన పోరు, భవిష్యత్‌లో ఎదుర్కోవాల్సిన కార్యచరణపైనా చర్చిస్తున్నారు. పాకిస్థాన్‌ను మరింత దీటుగా ఎదుర్కోవడానికి చేపట్టవల్సిన చర్యలపైనా సమాలోచనలు చేస్తున్నారు.

కాగా పాకిస్థాన్‌కు చెందిన నాలుగు ఎయిర్ బేస్‌లపై శనివారం భారత్ సైన్యం దాడి చేసింది. పాకిస్థాన్ సైతం భారత సరిహద్దులో 26 ప్రాంతాల్లో దాడులకు విఫలయత్నం చేసింది. ఈ దాడులకు సంబంధించి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వివరించారు.

Next Story