పాకిస్తాన్ వాళ్లకి ఇండియాలో ఒక సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందనే సాటిస్ఫాక్షన్ కూడా ఉండకూడదు.. నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-05-10 02:45:01.0  )
పాకిస్తాన్ వాళ్లకి ఇండియాలో ఒక సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందనే సాటిస్ఫాక్షన్ కూడా ఉండకూడదు.. నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్-3: ది థర్డ్‌ కేస్‌’(Hit-3). శైలేష్‌ కొలను(Sailesh Kolanu) తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించింది. అలాగే సూర్య శ్రీనివాస్, రావు రమేష్, సముద్ర ఖని, కోమలి ప్రసాద్, నెపోలియన్, రవీంద్ర విజయ్, ప్రతీక్ బబ్బర్, టిస్కా చోప్రా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే కొందరు స్టార్ హీరోలు క్యామియో రోల్స్‌లో కనిపించారు. అయితే వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రోడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చారు. కాగా మే01న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది.

దీంతో తాజాగా హిట్-3 మూవీ టీమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. అక్కడ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అవతల వాళ్లు మనకు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన ఇండియన్ ఆర్మి చాలా పద్ధతిగా, ఫోకస్‌గా, డిగ్నిఫైడ్‌గా వారికి తిరిగి ఇచ్చింది. వాళ్లు చేసిన దానికి ఇండియాలో ఒక పార్ట్ అయిన ఒక సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందని సాటిస్ఫాక్షన్ కూడా పాకిస్తాన్ వాళ్లకి ఇవ్వకూడదు. అందుకే ఈ ఈవెంట్‌ను నిర్వహించాలి అనిపించింది. అక్కడ మన ఇండియా కోసం పోరాడుతున్న ప్రతిఒక్క సోల్జర్‌కి సెల్యూట్.. జైహింద్’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Next Story

Most Viewed