మరోసారి తోక జాడించిన పాకిస్తాన్.. మోడీ వార్నింగ్ ఇచ్చినా మారని తీరు

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-12 16:35:02  IST  )

పాకిస్తాన్(Pakistan) మరోసారి తోక జాడించింది. సోమవారం రాత్రి కాల్పుల విరమణ(Ceasefire )ను ఉల్లంఘించింది.

మరోసారి తోక జాడించిన పాకిస్తాన్.. మోడీ వార్నింగ్ ఇచ్చినా మారని తీరు
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్(Pakistan) మరోసారి తోక జాడించింది. సోమవారం రాత్రి కాల్పుల విరమణ(Ceasefire )ను ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లోని సాంబ, కథువా సెక్టార్లలో డ్రోన్‌లు దాడులకు ప్రయత్నించింది. పాక్ వక్రబుద్ధిపై ఇప్పటికే ఓ కన్నేసి ఉంచిన భారత సైన్యం.. పాక్‌ డ్రోన్‌లను ధీటుగా ఎదుర్కొంది. దీంతో పంజాబ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్‌లలోని పలు ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్ విధించారు. ఇదిలా ఉండగా.. గంటక్రితమే పాకిస్తాన్‌కు ప్రధాని మోడీ(PM Modi) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించి భారత్‌పై దాడికి పాల్పడితే.. కలలో కూడా ఊహించని విధంగా ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. ఉగ్రవాదం(Terrorism) ఏ రూపంలో ఉన్నా తుద ముట్టిస్తామని స్పష్టం చేశారు. న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిలింగ్‌‌కు పాల్పడితే సహించేది లేదని పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని ప్రకటించారు. అయితే.. మోడీ వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘించడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై కేంద్రం ఏ స్టెప్ తీసుకుంటుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Next Story