- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైఅలర్ట్: భారత్‌లో మొత్తం 24 నగరాలను టార్గెట్ చేసిన పాక్
పాకిస్తాన్(Pakistan) మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. భారత్(India)పై మరోసారి దాడికి యత్నించింది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్(Pakistan) మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. భారత్(India)పై మరోసారి దాడికి యత్నించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 24 సరిహద్దు నగరాలను టార్గె్ట్ చేసింది. గురువారం రాత్రి దాదాపు 500 డ్రోన్లతో దాడులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు.. పాక్ డ్రోన్లను గగనతంలోనే మట్టుబెట్టాయి. మరోవైపు ఆపరేషన్ సిందూర్ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్థాన్(Rajasthan), గుజరాత్(Gujarat), జమ్ముకశ్మీర్(Jammu and Kashmir) వంటి కీలక ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ (Indian Army) అలర్ట్ ప్రకటించింది. నిన్న రాత్రి మాదిరిగా ఇవాళ కూడా పాక్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇస్రో కేంద్రాల దగ్గర హై అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట, బెంగళూరు సహా 11 ఇస్రో కేంద్రాల్లో అలర్ట్ ప్రకటించారు. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్రో కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
రాజస్థాన్‌లో హై అలర్ట్ ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి ఇళ్లలోనే ఉండాలని భారత్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో సైరన్ మోగించి పౌరులను భద్రతా ధళాలు అప్రమత్తం చేస్తున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం విషయంలో విమానయాన శాఖ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ విమానాశ్రయం తెరిచే ఉందని కానీ.. కొన్ని సర్వీసులు మాత్రం రద్దయినట్లు వెల్లడించింది. 9 అంతర్జాతీయ సర్వీసులు, 129 దేశీయ సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపింది. ప్రయాణికులకు విమానయాన శాఖ అడ్వైజరీ ఎయిర్ పోర్టులకు 3 గంటల ముందుగానే చేరుకోవాలని సూచనలు చేసింది.






