- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెల్లవారితే చర్చలు.. మరోసారి వక్రబుద్ధిని చూపిన పాక్.. భారత్‌లోకి డ్రోన్‌లు
వక్రబుద్ధిని పాకిస్తాన్(Pakistan) మరోసారి బయటపెట్టింది. సీజ్‌ఫైర్(Ceasefire) నిబంధనలనూ ఉల్లంఘించింది.

దిశ, వెబ్‌డెస్క్: వక్రబుద్ధిని పాకిస్తాన్(Pakistan) మరోసారి బయటపెట్టింది. సీజ్‌ఫైర్(Ceasefire) నిబంధనలనూ ఉల్లంఘించింది. తాజాగా రాజస్థాన్(Rajasthan)లోని బర్మార్(Burmar)లో డ్రోన్‌లు కనిపించాయని ఆ జిల్లా యంత్రాంగం ట్వీట్ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే అధికారుల సాయం తీసుకోవాలని సూచనలు చేసింది. బర్మార్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం బ్లాక్ అవుట్(Black Out) విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాకిస్తాన్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా ధీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే భారత సైన్యం ప్రకటించింది. పాక్ ప్రతిపాదన మేరకే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చామని పేర్కొంది. ఇదే పరిస్థితి నేడు కొనసాగితే తీవ్ర ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఉల్లంఘనలపై దీటుగా స్పందించేందుకు క్షేత్రస్థాయి అధికారులకు సైన్యాధ్యక్షుడు పూర్తి అధికారాలు ఇచ్చారని డీజీఎంవో అధికారి స్పష్టం చేశారు.






