- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాంబుల వర్షం కురిపిస్తున్న భారత్.. అతిపెద్ద దాడిగా ప్రకటించిన పాకిస్తాన్
భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య భీకర యుద్ధం జరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. గురువారం సాయంత్రం పాకిస్తాన్ వరుసగా ఇండియాపై దాడి చేయడంతో భారత్ రివర్స్ ఎటాక్‌కు దిగింది. పాకిస్తాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, సియోల్‌కోట్‌లే లక్ష్యంగా చేసుకొని ప్రతి దాడి చేస్తోంది. భారత్ బాంబుల వర్షంపై పాకిస్తాన్ కీలక ప్రకటన చేశారు. భారత్ తమపై అతిపెద్ద దాడికి దిగిందని పాకిస్తాన్ ప్రకటించింది. జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో పాకిస్తాన్ పంపిన రెండు డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా గుర్తించి గాల్లోనే పేల్చివేసింది. అంతే కాకుండా ఖోర్ ప్రాంతంలో మరో రెండు డ్రోన్లు కూల్చివేయబడ్డాయి. ఈ చర్యలన్నీ ఆధునిక సాంకేతికతతో సమన్వయంగా అమలయ్యాయి. కుప్వారా, ఉధంపూర్ ప్రాంతాల్లో ఫిరంగి దాడులు జరిగాయని, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ ను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిగినట్లు సమాచారం. పక్కనే ఉన్న ఇతర ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.






