- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shehbaz Sharif: భారత వైమానిక దాడులపై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
భారత వైమానిక దాడులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాబజ్ ఫరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో స్పందించిన షరీఫ్..శత్రు దేశమైన భారత్ పాకిస్థాన్ లోని ఐదు ప్రదేశాలపై పిరికి దాడులకు పాల్పడిందని పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత వైమానిక దాడులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాబజ్ ఫరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో స్పందించిన షరీఫ్..శత్రు దేశమైన భారత్ పాకిస్థాన్ లోని ఐదు ప్రదేశాలపై పిరికి దాడులకు పాల్పడిందని పేర్కొన్నారు. భారత్ చేసిన ఈ దాడులకు పాకిస్థాన్ తప్పకుండా బలమైన సమాధానం చెబుతుందని అన్నారు. ఈ ఉద్రిక్త వాతావరణ వేళ యావత్ పాకిస్థాన్ సాయుధ దళాలకు అండగా ఉంటుందని తెలిపారు.
తన శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్థాన్ సైనికులకు బాగా తెలుసు అని అన్నారు. పాకిస్థాన్ ఆత్మవిశ్వాసం చాలా గొప్పదని, భారత్ ను గెలవనివ్వము అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటి వరకు 70 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తోంది. 10 మందికిపైగా గాయపడినట్టు సమాచారం. భారత్ వైమానిక దాడుల్లో బహవల్ పూర్ లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ హెడ్ క్వార్డర్ కూడా ఉంది దీంతో ఆయన బతికి ఉన్నాడా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.






