ఇండియాను దొంగ దెబ్బ తీసేందుకు పాకిస్తాన్ కొత్త కుట్రలు !

by velandi.Saikiran |   (  Updated:2025-05-07 18:31:05  IST  )

పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మరో సంచలన ప్రకటన చేశాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ ఇండియన్ ఆర్మీ నిర్వహించిన

ఇండియాను దొంగ దెబ్బ తీసేందుకు పాకిస్తాన్ కొత్త కుట్రలు !
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మరో సంచలన ప్రకటన చేశాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ ఇండియన్ ఆర్మీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 100కు పైగా ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టడంపై పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన చేశారు.

పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి తాజాగా ఆయన ప్రసంగించారు. ప్రతి పాకిస్తాన్ రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని... ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. ఇండియాకు ఎలా బదులు ఇవ్వాలో పాకిస్తాన్ కు బాగా తెలుసు అని గుర్తు చేశారు. చనిపోయిన సాయుధ దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందని... పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వివరించారు. తన శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్థాన్‌కు తెలుసంటూ వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Next Story