- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిందూర్ ఎఫెక్ట్..భయం గుప్పిట్లో పాక్.. పారిపోతున్న ప్రజలు
భారత్ చేసిన స్ట్రైక్స్ తో పాకిస్థాన్‌లో యుద్ధ భయం మొదలైంది. ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడులతో ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు.

దిశ,వెబ్ డెస్క్: భారత్ చేసిన స్ట్రైక్స్ తో పాకిస్థాన్‌లో యుద్ధ భయం మొదలైంది. ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడులతో ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. ఎక్కడ యుద్ధం వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుండి బయటకు రావాలంటేనే అక్కడి ప్రజలు భయపడిపోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పరిస్థితి ఎలా ఉంటుందో అని డబ్బుల కోసం ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు.
భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సైతం ప్రజలు ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే పాక్ ఆర్థికమాంద్యంతో ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. పహల్గామ్ ఎటాక్ తరవాత భారత్ విధించిన ఆంక్షలతో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు సైతం కుప్ప కూలాయి. ఇక ఆపరేషన్ సిందూర్ తరవాత స్టాక్ మార్కెట్లు 6 శాతం పడిపోయాయి. పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా కూడా నిన్నటి వరకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం భారత్ దాడులు ఆపితే తాము కూడా ఆపేస్తామని ప్రకటించారు. దీంతో పాకిస్థాన్ సైతం యుద్ధం విషయంలో వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.






