- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమృత్‌సర్‌పై పాక్ మిస్సైల్ ప్రయోగం.. కుట్రను భగ్నం చేసిన ఇండియన్ ఆర్మీ
పహల్గాం టెర్రర్ అటాక్‌కు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ (Indian Army) చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో పాక్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్‌కు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ (Indian Army) చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో పాక్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు, ఎలా భారత్ తమపై అటాక్ చేస్తోందోనని తెలియక అక్కడి సైనికాధికారులు తలలు పట్టుకుంటున్నారు. మంగళవారం రాత్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో జైష్-ఎ-మహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కేంద్రాలు, ట్రైనింగ్ క్యాంపులు బూడిదయ్యాయి. ఈ క్రమంలోనే ప్రతీకారానికి సిద్ధమైన దాయాది దేశం లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లతో మన దేశ భూ భాగమైన అమృత్‌సర్‌పై మిస్సైల్‌ను ప్రయోగించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ కుట్రను సమర్ధవంతగా భగ్నం చేశాయి. ఏకంగా పాక్ ప్రయోగించిన మిస్సైల్‌ను యాంటి మిస్సైల్ టెక్నాలజీని ఉపయోగించి గాల్లోనే బ్లాస్ట్ చేశారు. అనంతరం అమృత్‌సర్ పరిసరాల్లో పాక్ మిస్సైల్ శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.






