Video: మా దేశంలో ఉగ్రస్థావరాలే లేవన్న పాక్ మంత్రి...లైవ్‌లో పరువు తీసిన యాంకర్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-07 14:06:15  IST  )

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిభిరాలపై భారత్ మిస్సైల్స్ తో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ హజార్ కుటుంబంతో పాటూ మరికొందరు ఉగ్రవాదులు మరణించారు.

Video: మా దేశంలో ఉగ్రస్థావరాలే లేవన్న పాక్ మంత్రి...లైవ్‌లో పరువు తీసిన యాంకర్
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిభిరాలపై భారత్ మిస్సైల్స్ తో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ హజార్ కుటుంబంతో పాటూ మరికొందరు ఉగ్రవాదులు మరణించారు. అయితే ఉగ్రదాడి తరవాత ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాకిస్థాన్ సమాచార ప్రసారశాఖ మంత్రి అత్తావుల్లా తరార్ అసలు తమ దేశంలో ఉగ్రవాద శిభిరాలే లేవని బుకాయించారు.

తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఉగ్రవాద నిర్మూలనకు తమ దేశమే ముందు ఉంటుందని అన్నారు. జాఫర్ ఎక్స్ ప్రెస్ హైజాక్ ఘటన జరిగినప్పుడు ఇండియా అసలు ఖండించలేదని అన్నారు. దీంతో యాంకర్ ఆధారాలతో ఆ మంత్రి నోరు మూయించగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అత్తావుల్లా తరార్ వ్యాఖ్యలు విన్న తరవాత యాంకర్ మాట్లాడుతూ..ఇటీవల మీ రక్షణ మంత్రే మూడు దశాబ్దాలుగా అమెరికా కోసం ఈ చెత్తపని చేస్తున్నామని, ఉగ్రవాదాన్ని పోశిస్తున్నామని చెప్పారని గుర్తు చేశారు. అంతే కాకుండా 2011లో పాకిస్థాన్‌లో అమెరికా సైన్యం కాల్చి చంపిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ అబోటాబాద్‌లోనే దొరికాడని గుర్తుచేశారు. తాను పాకిస్థాన్ వచ్చానని, బిన్ లాడెన్ పాకిస్థాన్‌లోనే దొరికాడని తనకు తెలుసు అని యాంకర్ అన్నారు. యాంకర్ మాటలతో లైవ్‌లోనే పాకిస్థాన్ మంత్రి పరువు పోయింది. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది.

Click For Tweet..

Next Story