పాకిస్థాన్ పై భారత్ డిజిట‌ల్ యుద్ధం...ఇకపై అవన్నీ బ్యాన్!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-11 13:16:12  IST  )

దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ కు చెందిన వెబ్ కంటెంట్ పై కేంద్రం బ్యాన్ విధించింది.

పాకిస్థాన్ పై భారత్ డిజిట‌ల్ యుద్ధం...ఇకపై అవన్నీ బ్యాన్!
X

దిశ, వెబ్ డెస్క్: దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ కు చెందిన వెబ్ కంటెంట్ పై కేంద్రం బ్యాన్ విధించింది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు, టీవీ ఛానల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ దేశానికి చెందిన పాటలు, సినిమాలు, ఓటీటీ కంటెంట్ అన్నింటిని బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాడ్ కాస్ట్‌లు ప్రసారం చేసినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా త‌క్ష‌ణ‌మే ఈ నిషేదం అమ‌లులోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉంటే ఇరు దేశాల మ‌ధ్య ప్రస్తుతం ఉధ్రిక్త ప‌రిస్థితులు కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్ప‌టికే పాకిస్థాన్ కు సంబంధించిన ప‌లువురు సెల‌బ్రెటీల అకౌంట్ల‌ను, రెచ్చ‌గొట్టే మరియు త‌ప్పుడు కంటెంట్ ప్ర‌చారం చేసేవారి సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను బ్యాన్ చేసింది. తాజా నిర్ణ‌యంతో ఆ దేశ కంటెంట్ పూర్తిగా భార‌త్ లో క‌నిపించ‌కుండా పోతుంది.

Next Story