పాక్ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉంది.. కల్నల్ సోఫియా ఖురేషీ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-10 06:21:09  IST  )

దాయాది పాకిస్థాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉందని కల్నల్ సోఫీయా ఖురేషీ వెల్లడించారు.

పాక్ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉంది.. కల్నల్ సోఫియా ఖురేషీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దాయాది పాకిస్థాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉందని కల్నల్ సోఫియా ఖురేషీ అన్నారు. భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన వేళ కాసేపటి క్రితం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పాక్ జరిపిన దాడులపై ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి దేశ సరిహద్దు రాష్ట్రాల్లో మొత్తం 26 చోట్ల పాక్ దాడుకు పాల్పడిందని పేర్కొన్నారు. ఫైటర్ జెట్లతో శ్రీనగర్, అవంతిపురాతో సహా పలుచోట్ల దాడులు చేసిందని తెలిపారు. అందుకు సంబంధించి పలు వీడియోలను సోఫియా ఖురేషీ స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ మీడియాకు స్పష్టంగా వివరించారు. అదేవిధంగా S- 400‌ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసిందని సోఫియా ఖురేషీ పేర్కొన్నారు

సరిహద్దు దాటి కౌంటర్ అటాక్ చేస్తున్నాం.. వ్యోమికా సింగ్

అనంతనం వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ.. దాడులతో పాకిస్థాన్ LOC వెంటన తీవ్ర ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పాక్ భద్రతా దళాలు డ్రోన్లు, లాంగ్ టార్గెట్ మిస్సైల్స్‌ను భారత్‌పై వాడుతోందని అన్నారు. అందుకు భారత వైమానిక దళం సరిహద్దులు దాటి నిర్భయంగా కౌంటర్ అటాక్ చేస్తుందని తెలిపారు. పాక్ దాడుల నుంచి ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించగలిగామని పేర్కొన్నారు. పాకిస్థాన్ సేనలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.

భారత్ ఆర్మీ బేస్‌లకు నష్టం వాటిల్లలేదు.. విక్రమ్ మిస్రీ

పాకిస్థాన్ జరిపిన దాడిలో భారత్ ఆర్మీ బేస్‌లకు ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ భారత ఆర్మీపై ఫేక్ ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. అధంపూర్ ఆర్మీ బేస్ ధ్వంసం చేసినట్టు చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పు అని ఖండించారు. నిరంతరం భారత్‌లోని నివాసాలను టార్గెట్ చేస్తోందని అన్నారు. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాప ఈ దాడుల్లో మృతి చెందారని పేర్కొన్నారు. ప్రార్థన మందిరాలు, గురుద్వరాలపై కూడా దాడులను ఆపడం లేదని తెలిపారు. పాక్‌లోని సాంకేతిక మౌలిక సదుపాయాలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల లక్ష్యంగా దాడులు చేశాం. ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాక్‌ కీలక స్థావరాలపై దాడులు చేశాం. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్‌లాంఛర్లను ధ్వంసం చేశామని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.

Next Story