పంజాబ్‌పై ఎటాక్ చేసిన పాకిస్తాన్.. ఆ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-08 16:28:47  IST  )

భారత దేశ వ్యాప్తంగా పాకిస్తాన్(Pakistan) వరుస దాడులకు పాల్పడుతోంది.

పంజాబ్‌పై ఎటాక్ చేసిన పాకిస్తాన్.. ఆ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశ వ్యాప్తంగా పాకిస్తాన్(Pakistan) వరుస దాడులకు పాల్పడుతోంది. గురువారం సాయంత్రం జమ్మూలోని ఏడు ప్రాంతాల్లో మిస్సైల్స్‌తో ఎటాక్ చేయగా, రాత్రి పంజాబ్‌(Punjab)పై విరుచుకుపడింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌, అమృత్‌సర్‌లో దాడికి యత్నించింది. జైసల్మేర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పైనా దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌ వైపు నుంచి దూసుకొస్తున్న అన్ని డ్రోన్లను కూల్చివేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు భద్రతా బలగాలకు సమాచారం అందించారు. వరుస దాడుల నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌ను రద్దు చేశారు. తక్షణమే మైదానం వీడి వెళ్లాలని ప్రేక్షకులకు సూచనలు చేశారు.

Next Story