- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్
పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్(Pak Army Cheif Asim Muneer) కు ప్రమోషన్ కటబెట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్ : పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్(Pak Army Cheif Asim Muneer) కు ప్రమోషన్ కటబెట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఆర్మీ చీఫ్ జనరల్ గా ఉన్న మునీర్ కు 'ఫీల్డ్ మార్షల్'(Field Marshal) ర్యాంకును ఇచ్చింది. ఈ నిర్ణయం పాక్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్(Pak PM Shehabaz Sharif) నేతృత్వంలోని క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల భారత్తో నెలకొన్న యుద్ధంలో(Bharat-Pak War) మునీర్ నాయకత్వం, “ఆపరేషన్ బున్యాన్-ఉమ్-మర్సూస్” విజయం సాధించడం కారణాలుగా ఈ పదోన్నతి కల్పిస్తున్నట్టు పేర్కొంది.
కాగా ఫీల్డ్ మార్షల్ అనేది పాకిస్తాన్ సైన్యంలో అత్యున్నత ఐదు నక్షత్రాల హోదా. ఇది గతంలో 1959లో అయూబ్ ఖాన్కు మాత్రమే ఇవ్వబడింది. ఈ పదోన్నతి అందుకున్న రెండవ వ్యక్తి మునీర్ కావడం గమనార్హం. అయితే ఈ ర్యాంకు వలన అదనపు అధికారాలు లేనప్పటికీ, సైనిక సేవలకు గుర్తింపుగా ఇవ్వబడుతుంది. కాగా కొందరు దీనిని జాతీయ గౌరవంగా కొనియాడగా, కొందరు మాత్రం పాక్ సైనిక లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నంగా విమర్శిస్తున్నారు.






