- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakistan anchor cried: ఆపరేషన్ సిందూర్.. లైవ్‌లో ఏడ్చేసిన పాకిస్థాన్ యాంకర్
పహల్గామ్ ఉగ్రదాడిని (pahalgam attack) ఖండిస్తూ భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడిని (pahalgam attack) ఖండిస్తూ భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ (oparation sindoor) పేరుతో భారత సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. కేవలం 23 నిమిషాల్లోనే ఉగ్రశిభిరాలను నేలమట్టం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. 9 ఉగ్రవాద శిభిరాలపై కాల్పులు జరిగాయి.
అయితే ఈ దాడి తరవాత పాకిస్థానీ న్యూస్ యాంకర్ (Pakistan anchor) ఒకరు వార్తలు చదువుతూ లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నాారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ దేశంపై ఇండియా దాడి చేస్తోందని చాలా మంది పాకిస్థాన్‌కు చెందిన పౌరులు చనిపోయారని అన్నారు. తమను ఆదుకోవాలని వేడుకున్నారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సామాన్య ప్రజలను మతం అడిగి మరీ కాల్చినప్పుడు ఎందుకు ఏడవలేదని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోశిస్తే ఇలాంటి పరిస్థితే వస్తుందని పేర్కొంటున్నారు.






