పాక్ ఆర్మీలో ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు !

by velandi.Saikiran |   (  Updated:2025-05-11 12:08:50  IST  )

ఇండియా ( India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఓ షాకింగ్ నిజం బయటకు

పాక్ ఆర్మీలో ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా ( India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఓ షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఒసామా బిన్ లాడెన్ (Osama bin Laden) కుటుంబ సభ్యులు పాకిస్తాన్ ఆర్మీలో ( Pakisthan army) ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. ఈ విషయాన్ని జాతీయ మీడియా కూడా ధృవీకరించింది. ప్రస్తుతం పాకిస్తాన్ మిలిటరీ స్పోక్స్ పర్సన్ అహ్మద్ షరీఫ్ చౌదరి ( Ahmed Shareef Chaudhry)... ఒసామా బిన్ లాడెన్ కుటుంబానికి సంబంధించిన వాడేనని సమాచారం అందుతుంది.

పాకిస్తాన్ మిలిటరీ స్పోక్స్ పర్సన్ అహ్మద్ షరీఫ్ చౌదరి తండ్రి... సుల్తాన్ బసురుద్దిన్ మహమ్మద్ ( Sultan Basuruddin Muhammad) ఒసామా బిన్ లాడెన్ కు సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అలాంటి సుల్తాన్ బసురుద్దిన్ మహమ్మద్ కొడుకు.. పాకిస్తాన్ మిలిటరీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇండియా పై యుద్ధం సమయంలో కూడా అహ్మద్ షరీఫ్ ( Ahmed Sharif Chaudhry)... కీలక పాత్ర వహించడం గమనార్హం. ఈ ఒక్క విషయంతో... పాకిస్తాన్ కుట్రలు మొత్తం బయటపడిపోయాయి. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎంత సపోర్ట్ చేస్తుందో ఈ ఒక్క విషయంలో తేల్చి చెప్పవచ్చు. ఇక దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బండ బూతులు తిడుతున్నారు ఇండియన్స్.

Next Story