ఆపరేషన్ సిందూర్.. టెర్రరిస్ట్ మసూద్ అజార్‌ కుటుంబం హతం

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-07 07:50:09  IST  )

ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ (Indian Army) బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) దాయాది పాకిస్థాన్‌కు వణుకు పుట్టిస్తోంది.

ఆపరేషన్ సిందూర్.. టెర్రరిస్ట్ మసూద్ అజార్‌ కుటుంబం హతం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ (Indian Army) బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) దాయాది పాకిస్థాన్‌కు వణుకు పుట్టిస్తోంది. బవహల్పూర్‌ (Bahawalpur)లోని జైష్-ఎ-మహమ్మద్‌, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ముఖ్యంగా బవహల్పూర్‌ (Bahawalpur) జైష్-ఎ-మహమ్మద్‌ క్యాంపులు, సుభాన్ అల్లా కాంప్లెక్స్‌‌పై జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మందితో పాటు అనుచరులు మరణించినట్లుగా అతడే స్వయంగా వెల్లడించాడు. అందులో మసూద్ అజార్ అక్క, బావ, మేనల్లుడు, అతడి భార్య కూడా ఉన్నారు.

Next Story