- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ
భారత సైన్యం ఎక్స్‌లో "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor)కు సంబంధించిన మరో వీడియోను విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : భారత సైన్యం ఎక్స్‌లో "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor)కు సంబంధించిన మరో వీడియోను విడుదల చేసింది. దీనిని "అభేద్యమైన అగ్ని గోడ"గా అభివర్ణిస్తూ.. పాకిస్థాన్ మిస్సైళ్లను నాశనం చేసిన దృశ్యాలను ప్రదర్శించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది పర్యాటకులు చనిపోయిన ఉగ్రదాడి తర్వాత మే 7న పాకిస్థాన్ చేపట్టిన మిస్సైల్ దాడులను పినాకా రాకెట్(Pinaka Rocket) లాంచర్‌తో అడ్డుకున్న సన్నివేశాలతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. వీడియోలో పాక్ మిస్సైళ్లు పినాకా రాకెట్‌తో నాశనం అయి, వ్యవసాయ భూముల్లో శిథిలాలై పడిన దృశ్యాలు ఉన్నాయి.
భారత్ వేగంగా తన టార్గెట్ ను పూర్తి చేసి.. పాక్‌లోని జైష్-ఎ-మహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా స్థావరాలతో సహా తొమ్మిది ఉగ్ర క్యాంపులను 23 నిమిషాల్లో ధ్వంసం చేసింది. బ్రహ్మోస్, ఆకాష్ మిస్సైళ్లతో పాక్ డ్రోన్లు, చైనా PL-15 మిస్సైళ్లు, టర్కీ యిహా డ్రోన్లను కూల్చారు. మే 9 రాత్రి పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంతో వాళ్ల పోస్టులను కూడా నాశనం చేశారు. సైన్యం దీన్ని "జస్టిస్ " అంటూ పాక్‌కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. మే 10న కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా, ఈ వీడియో భారత్ యొక్క బలమైన సైనిక శక్తిని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టి వైఖరిని చూపిస్తూ సాగడంతో.. X లో ఈ వీడియో వైరల్ అయింది.






