Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. బీజేపీ "తిరంగ యాత్ర"

by Muthe.Rajitha |   (  Updated:2025-05-12 14:58:43  IST  )

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయవంతం అయిన నేపథ్యంలో బీజేపీ(BJP) ఓ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. బీజేపీ తిరంగ యాత్ర
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయవంతం అయిన నేపథ్యంలో బీజేపీ(BJP) ఓ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్ పాకిస్తాన్, POK లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను హతం చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఈ చర్య అనంతరం సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ కాల్పులకు పాల్పడగా.. వారిని ధీటుగా ఎదుర్కొని గట్టి బుద్ధి చెప్పింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరగడంతో పాక్ దిగివచ్చింది. దీంతో మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందం చేసుకున్నాయి.

కాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో.. బీజేపీ దేశవ్యాప్త ర్యాలీకి శ్రీకారం చుట్టింది. "తిరంగ యాత్ర"(BJP Tiranga Yatra) పేరుతో నిర్వహించే ఈ ర్యాలీ.. మే 13 నుంచి 23వ తేదీ వరకు 11 రోజుల పాటు అన్ని రాష్ట్రాల గుండా సాగనుంది. పార్టీకి చెందిన అగ్రనేతలు ఈ ర్యాలీలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Next Story