- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : ప్రధాని నివాసంలో మరోసారి సమావేశం
భారత్ - పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ జరగ్గా.. ప్రధాని నరేంద్రమోడీ (PM Modi Meeting) నివాసంలో మరోసారి త్రివిధ దళాధిపతులు (Tri Armed Forces) సమావేశమయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ జరగ్గా.. ప్రధాని నరేంద్రమోడీ (PM Modi Meeting) నివాసంలో మరోసారి త్రివిధ దళాధిపతులు (Tri Armed Forces) సమావేశమయ్యారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అజిత్ దోవల్, సెంటర్ డిఫెన్స్ స్టాఫ్ డైరెక్టర్ అనిల్ చౌహాన్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ జరగడంతో.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలేంటి? మే 12న జరిగే చర్చల్లో ఏయే అంశాలను ప్రస్తావించాలి? పాకిస్థాన్ మళ్లీ కవ్వింపులకు పాల్పడితే ఏం చేయాలన్న కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.
కాగా.. కాల్పుల విరమణకు ప్రధాని కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. సింధునదీజలాల ఒప్పందం సస్పెన్షన్లో ఎలాంటి మార్పు ఉండదని, కేవలం కాల్పుల విరమణకే అంగీకరిస్తున్నామని చెప్పినట్లు నేషనల్ మీడియాతో కథనాలు వెలువడ్డాయి. కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కూడా ఈ విషయాలనే ప్రస్తావించారు.
పాకిస్తాన్‌తో ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై భారతదేశం కట్టుబడి ఉన్నప్పటికీ, మళ్లీ యుద్ధవాతావరణం ఎదురైతే అందుకు భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని కమోడోర్ ఆర్ నాయర్ తెలిపారు. దేశం సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఆర్మీ ఎప్పుడూ నిబద్ధతతో ఉంటుందన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ.. ఎనీ టైమ్ యుద్ధానికి సిద్ధంగా ఉంటుందని, శత్రువుల ప్రతిస్పందనకు ధీటుగా బదులివ్వడంలో వెనుకాడబోమన్నారు.






