Fake Alert : ఢిల్లీ విమానాశ్రయంపై మిస్సైల్ దాడి? పాకిస్తాన్ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం: PIB

by Ramesh Naini |

భారత్-పాకిస్తాన్‌ల మధ్య ప్రస్తుతం యుద్ద వాతవరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు భారత్, అటూ పాకిస్తాన్ ప్రజల్లో ఆందోళన కలిగించేలా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు.

Fake Alert : ఢిల్లీ విమానాశ్రయంపై మిస్సైల్ దాడి? పాకిస్తాన్ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం: PIB
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Fake Alert:) భారత్-పాకిస్తాన్‌ల (India-Pakistan tension) మధ్య ప్రస్తుతం యుద్ద వాతవరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు భారత్, అటూ పాకిస్తాన్ ప్రజల్లో ఆందోళన కలిగించేలా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయిల్, గాజా, ఉక్రెయిన్, రష్యాల మధ్య జరిగిన మిస్సైల్ దాడులకు సంబంధించిన వీడియోలను (Social media) సోషల్ మీడియా కేటుగాళ్లు ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా భారత్‌పై జరిపిన దాడులు అంటూ పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంపై క్షిపణి దాడి జరిగిందని ఫేక్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫేక్ న్యూస్ ప్రచారంపై కేంద్రం అలర్ట్ అయింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పీఐబీ(Press Information Bureau) ఈ వీడియోలు అవాస్తవమని స్పష్టం చేసింది. ‘న్యూఢిల్లీ విమానాశ్రయంపై మిస్సైల్ దాడి అంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ వీడియో 2024 ఆగస్టులో యెమెన్‌ దేశంలోని అడెన్‌లో జరిగిన గ్యాస్ స్టేషన్ పేలుడు జరిగింది. దీనికి ప్రస్తుత భారత్-పాకిస్తాన్ పరిస్థితికి ఎటువంటి సంబంధం లేదు.’ ఎక్స్‌లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిర్దారించింది.

కాగా, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది. ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే PIB ఫ్యాక్ట్ చెక్‌కు చేరవేయాలని ప్రభుత్వం పౌరులను కోరింది. దీని కోసం +918799711259 నంబర్‌కు వాట్సాప్ ద్వారా, [email protected] వెబ్‌సైట్ ద్వారా అధికారులను అప్రమత్తం చేయోచ్చని పేర్కొంది. అలాగే ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తప్పుడు సమాచారానికి బలికావొద్దని సూచించారు. అధికార వర్గాల సోర్స్‌ని మాత్రమే ధ్రువీకరించుకోవాలని తెలిపారు.

Next Story