India-Pakistan: శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-10 07:14:44  IST  )

ఆపరేషన్ సిందూర్‌కు (Operation sindoor) ప్రతీకారంగా పాకిస్థాన్‌ భారత సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు పాల్పడుతోంది.

India-Pakistan: శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్‌కు (Operation sindoor) ప్రతీకారంగా పాకిస్థాన్‌ భారత సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు పాల్పడుతోంది. ఈ దాడులను భారత ఆర్మీ (Indian army) దీటుగా ఎదుర్కొంటోంది. శనివారం తెల్లవారుజాము నుంచి జనావాసాలే టార్గెట్‌గా భారత సరిహద్దు ప్రాంతాలపై వరుస దాడులు చేస్తోంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌‌ ఎయిర్‌పోర్టు (Srinagar airport) సమీపంలో శనివారం ఉదయం 11:45 సమీపంలో మరోసారి పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుళ్లతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలను తరలివెళ్లాలని సూచిస్తున్నారు. కాగా, శనివారం తెల్లవారుజామున కూడా శ్రీనగరంలో బాంబ్ పేలుళ్లు వినిపించినట్లు అధికారులు వెల్లడించారు. ఇవి శుక్రవారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్ల దాడులను భారత సైన్యం విజయవంతంగా అడ్డుకున్న కొద్దిసేపటికే జరిగినట్లు సమాచారం.

Next Story