- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్.. స్టార్ హీరోలపై విరుచుకుపడ్డ పోలీసులు.. నెట్టింట సంచలనం రేపుతున్న ఖాకీల పోస్ట్.. అవకాశవాదులంటూ.. ఫ్యాన్స్ హర్ట్..
బాలీవుడ్ భారీ విమర్శలు ఎదుర్కొంటోంది. ఆపరేషన్ సిందూర్ టైంలో సెలబ్రిటీలు స్పందించకపోవడమే ఇందుకు కారణం. కాగా యుద్ధం అయిపోయిన తర్వాత పోస్టులు పెట్టిన వారిని కూడా నెటిజన్లు ఏకిపారేశారు. ఇప్పుడెందుకు ఇవన్నీ అంటూ ఇండైరెక్ట్‌గా బూతులు తిట్టినంత పనిచేశారు. అయితే

దిశ, ఫీచర్స్ : బాలీవుడ్ భారీ విమర్శలు ఎదుర్కొంటోంది. ఆపరేషన్ సిందూర్ టైంలో సెలబ్రిటీలు స్పందించకపోవడమే ఇందుకు కారణం. కాగా యుద్ధం అయిపోయిన తర్వాత పోస్టులు పెట్టిన వారిని కూడా నెటిజన్లు ఏకిపారేశారు. ఇప్పుడెందుకు ఇవన్నీ అంటూ ఇండైరెక్ట్‌గా బూతులు తిట్టినంత పనిచేశారు. అయితే తాజాగా మహారాష్ట్ర పోలీసులు కూడా బాలీవుడ్ పరువు తీసి బజారున పెట్టేశారు. అదే లెండి సోషల్ మీడియాలో పెట్టేశారు. ‘ ఇదే సేఫ్ టైం. మీరు ఇక మీ సోషల్ మీడియా ప్లేస్‌కు తిరిగి రావొచ్చు. మీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి పాక్కుంటూ వచ్చేయండి. మీ ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ప్రమాదం లేదు. బాలీవుడ్ వాయిస్‌లు ఎక్కడున్నాయి?’ అంటూ స్టేటస్ పెట్టారు. దీనిపై సోషల్ మీడియా రియాక్షన్ నెక్స్ట్ లెవల్ ఉంది.
ఈ పోస్ట్‌తో మహారాష్ట్ర పోలీసులు బాలీవుడ్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేశారంటూ వీడియోలు వైరల్ చేస్తున్నారు. కొందరు ఇది నిజమేనా కాదా అని చెక్ చేసి.. నిజం కాదేమోనని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి అవకాశవాదులను బాయ్ కాట్ చేయాలంటూ మండిపడుతున్నారు. సిగ్గు అనిపిస్తుంది.. మనమేమో సెలబ్రిటీలుగా నిలబెడితే.. వారు మాత్రం పక్కదేశం సైడ్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ పాకిస్తాన్‌కు ఇండైరెక్ట్‌గా మద్దతిస్తుందని తిట్టిపోస్తున్నారు.






