- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సియాల్‌కోట్ సైరెన్.. ఆందోళనలో పాకిస్తాన్ ప్రజలు !
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదులను

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేసేందుకు ఆపరేషన్ సిందూర్ ( Operation Sindoor) ప్రయోగించింది ఇండియన్ ఆర్మీ ( Indian Army). అయితే ఈ ఆపరేషన్ జరిగి 24 గంటలు ముగియకముందే... పాకిస్తాన్ దేశ ప్రజలకు కొత్త టెన్షన్ మొదలైంది.
పాకిస్తాన్ దేశంలోని సియాల్‌కోట్ ( Sialkot) ప్రాంతంలో ఒక్కసారిగా సైరన్ వచ్చింది. అర్ధరాత్రి అందరు పడుకున్నా తర్వాత అంటే దాదాపు బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ లోని సియాల్‌కోట్ ప్రాంతంలో సైరన్ సౌండ్ ( Sirens heard in Sialkot) వచ్చింది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు గజగజ వణికి పోతున్నారు. సైరన్ రావడంతో పరుగులు కూడా తీశారు. అరుస్తూ.. పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వాస్తవానికి సియాల్‌కోట్ ప్రాంతంలో ఈ సైరన్ వచ్చిందా..? లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందా? అనేది క్లారిటీ లేదు. కానీ ప్రాథమికంగా సియాల్‌కోట్ అని నిర్ణయించారు. ఇది ఇలా ఉండగా... ఇండియా పై ఎప్పుడైనా దాడి చేసేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా జాతిని ఉద్దేశించి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మాట్లాడారు. ప్రతి రక్తపు బొట్టుకు అధికారం తీర్చుకుంటామని... హెచ్చరికలు పంపారు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్.






