చ‌ట్ ప‌ట్ యుద్ధం వ‌ల్ల పాక్ త‌క్కువ చేసి మాట్లాడుతుంది: ఖ‌ర్గే

by Ajay Maddhiboyina |

పహల్గామ్ దాడిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన భద్రత కల్పించకపోవడం వల్లనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.

చ‌ట్ ప‌ట్ యుద్ధం వ‌ల్ల పాక్ త‌క్కువ చేసి మాట్లాడుతుంది: ఖ‌ర్గే
X

దిశ‌, వెబ్ డెస్క్: పహల్గామ్ దాడిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన భద్రత కల్పించకపోవడం వల్లనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. మోడీ ఏప్రిల్ 17న కాశ్మీర్లో పర్య‌టించాల్సి ఉంది కానీ నిఘా సంస్థ‌లు హెచ్చ‌రించ‌డంతోనే ఆయ‌న ర‌ద్దు చేసుకున్నారని అన్నారు. ఈ దాడి జ‌రుగుతుంద‌ని కేంద్రానికి ముందే తెలుసా? లేదా? అని ప్ర‌శ్నించారు. ముందే ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించి ఉంటే 26 మంది అమాయ‌కుల ప్రాణాలు కాపాడేవార‌ని అన్నారు. ఇప్పుడు జ‌రిగిన చిన్న యుద్దంతో పాకిస్థాన్ భార‌త దేశాన్ని త‌క్క‌వ చేసి చూపిస్తోంద‌ని మండిప‌డ్డారు. ముఖ్యంగా చైనా ప‌రోక్ష మ‌ద్ద‌తుతో పాకిస్థాన్ ఇండియాను త‌క్కువ చేసి చూపిస్తోంద‌ని అన్నారు.

ఆప‌రేష‌న్ సిందూర్ పై భార‌త్ వైఖ‌రిని తెలిపేందుకు బ‌హుళ పార్టీ ప్ర‌తినిధుల‌ను విదేశాల‌కు పంపాల‌ని నిర్ణ‌యం తీసుకున్న మోడీ త‌మ పార్టీని సంప్ర‌దించ‌లేద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ అభ్యంత‌రం చెప్ప‌డం లేద‌ని జాతీయ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఇత‌ర పార్టీల ప్ర‌తినిధులు వెళుతున్నార‌ని అన్నారు. మా ఉద్దేశం దేశాన్ని ర‌క్షించ‌డం కానీ రాజ‌కీయాలు చేయ‌డం కాద‌ని స్ప‌ష్టం చేశారు. 26 మంది ఉగ్ర‌దాడిలో మ‌ర‌ణించినా మోడీ బీహార్ ర్యాలీలు నిర్వ‌హించ‌డంలో బిజీగా ఉన్నార‌ని మండిప‌డ్డారు. రెండు అఖిల‌ప‌క్ష స‌మావేశాలు జ‌రిగినా మోడీ రాలేద‌న్నారు. తాము స‌మావేశాల‌కు దూరంగా ఉంటే దేశ‌ద్రోహులు అని పిలుస్తార‌ని చెప్పారు. కానీ మోడీ రాక‌పోతే దేశ‌భ‌క్తిగా ముద్ర‌వేస్తార‌ని అన్నారు. ఈ ద్వంద్వ ప్ర‌మాణాలు ఎందుకు అని ఖ‌ర్గే ప్ర‌శ్నించారు.

Next Story