- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాకచక్యంగా యుద్ధం ఆపేశాను: KA పాల్ ప్రకటన
గత రెండు, మూడు రోజులుగా భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: గత రెండు, మూడు రోజులుగా భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చందని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ(Vikram Misri) వెల్లడించారు. ఈనెల 12వ తేదీన భారత్ - పాక్ మధ్య ప్రత్యక్ష చర్యలు ఉంటాయని.. ప్రత్యక్ష చర్చల తర్వాతే కాల్పుల విరమణపై ఇరు దేశాలు నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ‘‘గత కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. రాత్రి పగలు కృషి చేసి భారత్- పాక్ యుద్ధాన్ని ఆపాను. అమెరికాలో రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, ఇరు దేశాల నేతలను కలిశాను. యుద్ధం ఆపేలా ప్రయత్నం చేశాను’’ అని చెబుతూ వీడియో విడుదల చేశారు. అంతకుముందు భారత్- పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శనివారం సాయంత్రం ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు ట్రంప్ ధన్యవాదాలు చెప్పారు.






